Page Loader
Sharwa 37: శ‌ర్వానంద్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా సాక్షి వైద్య 
Sharwa 37: శ‌ర్వానంద్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా సాక్షి వైద్య

Sharwa 37: శ‌ర్వానంద్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా సాక్షి వైద్య 

వ్రాసిన వారు Stalin
Jun 19, 2024
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏజెంట్,గాండీవవధారి అర్జున చిత్రాల ఫేమ్ సాక్షి వైద్య కొత్త చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. నేడు సాక్షి వైద్య బ‌ర్త్ డే. ఆమె ఈ సారి శ‌ర్వానంద్ సరసన నటించనుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆమెకు విషెస్ తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌న‌మే సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న టాలీవుడ్ న‌టుడు శ‌ర్వానంద్ మ‌రో ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించబోతున్నాడు. శ‌ర్వానంద్ సినిమాలకు తెలుగులో ఓ ప్రత్యేకత వుంది. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా ప్రాజెక్ట్ శర్వా 37(Sharwa 37).

వివరాలు 

నిత్య పాత్ర‌లో సాక్షి

సామజవరగమన ఫేం రామ్‌ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి శ‌ర్వా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. డార్క్ షేడ్‌లో అల‌రిస్తున్నాడు. ఈ చిత్రంలో నిత్య అనే పాత్ర‌లో సాక్షి అల‌రించ‌నుంది. అడ్వెంచరస్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ప్రై లిమిటెడ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఏకే ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సాక్షి వైద్య పోస్టర్