LOADING...
Naari Naari Naduma Murari: 'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ విడుదల తేదీ ఖరారు..
'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ విడుదల తేదీ ఖరారు..

Naari Naari Naduma Murari: 'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ విడుదల తేదీ ఖరారు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో యంగ్ హీరో శర్వానంద్‌కు చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతూ ఘన విజయాన్ని నమోదు చేసింది. శర్వానంద్‌కు సాలిడ్ హిట్ వచ్చి చాలాకాలం కావడంతో, 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజుతో ఈ ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించగా, సాక్షి వైద్య,సంయుక్త హీరోయిన్లుగా నటించారు. మొదటగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని చాలామంది అనుకోలేదు. కానీ నిర్మాతల సరైన ప్లానింగ్‌తో జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని అందుకుంది.

వివరాలు 

ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement