LOADING...
Shilpa Shetty: రెస్టరంట్‌ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
రెస్టరంట్‌ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి

Shilpa Shetty: రెస్టరంట్‌ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన ఫేమస్‌ రెస్టరంట్‌ 'బాస్టియన్‌'ను మూసివేస్తున్నట్టు శిల్పా షెట్టీ (Shilpa Shetty) ప్రకటించిన వార్త బుధవారం వైరల్‌ అయ్యింది. అయితే, ఈ వార్తపై వచ్చిన పలు సందేహాలను తీరుస్తూ శిల్పా తాజాగా స్పష్టత ఇచ్చారు. తన ప్రకటన అనంతరం వేల మంది ఫోన్లు చేశారని తెలిపారు. ముంబై బాంద్రాలోని ప్రముఖ రెస్టరంట్‌లలో ఒకటిగా ఉన్న 'బాస్టియన్‌'ను మూసివేస్తున్నట్టు శిల్పా సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు. అయితే, ఆమె వివరాల ప్రకారం, రెస్టరంట్‌ను పూర్తిగా మూసివేయడం జరుగట్లేదు. రెస్టరంట్‌పై ప్రజల ప్రేమ చూసి ఎంతో ఆనందంగా ఉందన్నారు.

వివరాలు 

 'బాస్టియన్‌ బీచ్‌ క్లబ్‌' పేరుతో జుహులో 

"నేను బాస్టియన్‌ను పూర్తిగా మూసివేయడం లేదని హామీ ఇస్తున్నాను. రెస్టరంట్ మూతపడదు, కేవలం ఒక అధ్యాయాన్ని ముగించాము. కొత్త రూపంలో మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. దక్షిణ భారతీయ వంటకాలను ఆస్వాదించదగిన కొత్త స్పాట్‌ను 'బాస్టియన్‌ బీచ్‌ క్లబ్‌' పేరుతో జుహులో ప్రారంభించనున్నాం. ఎన్ని బ్రాంచ్‌లు తెరిచినా బాంద్రాలోని రెస్టరంట్‌ మూలం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. రెస్టరంట్‌ను పూర్తిగా మూసివేస్తామన్న ప్రచారం నిజం కాదు. అక్టోబర్‌లో మేమే జుహులో దీన్ని ప్రారంభిస్తాం"అని క్లారిటీ ఇచ్చారు.

వివరాలు 

చివరిసారిగా గురువారం వేడుక నిర్వహిస్తున్నాం: శిల్పా 

ముంబయిలో 'బాస్టియన్‌' మంచి పేరును సంపాదించిన రెస్టరంట్‌గా ఉంది. మూసివేస్తున్నట్టు ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. శిల్పా చెప్పినట్టుగా, 'బాస్టియన్‌' అనేక జ్ఞాపకాలు, మర్చిపోలేని క్షణాలు, ఆనందాలను అందించిన వేదిక. ఈ రెస్టరంట్ చివరిసారిగా గురువారం వేడుక నిర్వహిస్తుందనడం ద్వారా వార్త మరింత చర్చనీయమైంది. నెట్టింట కూడా ఈ విషయంపై పలు కథనాలు వచ్చినా, శిల్పా తాజా క్లారిటీతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడింది.