భార్య పడుకున్నాక మరదలితో పార్టీ.. శిల్పా శెట్టి భర్త ఆసక్తికర కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన సహస వీరుడు, సాగర కన్య సినిమాతో శిల్పాశెట్టి టాలీవుడ్ అరంగ్రేటం చేసింది.
ఐదు పదుల వయస్సు దగ్గరికొస్తున్న తన అందంతో ఇప్పుడొచ్చే హీరోయిన్లకు గట్టి పోటినిస్తోంది. దాదాపు 14ఏళ్ల క్రితం ఆమె వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది.
ఇటీవల పోర్న్ సినిమాల వివాదంతో రాజ్ కుంద్రా రెండు నెలలు జైల్లో గడిపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత బెయిల్ పై వచ్చిన ఆయన ఎప్పుడు బయట కనిపించలేదు. తాజాగా ఓ షోలో రాజ్ కుంద్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
Details
శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల బాగా కలిసొచ్చింది: రాజ్ కుంద్రా
హిందీ టెలివిజన్ రంగంలో టాప్ షోగా పేరున్న కపిల్ శర్మ షోకు రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమిత శెట్టి వచ్చారు.
శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల తనకు బాగా కలిసొచ్చిందని, పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేదని, పార్టీలు నచ్చేవి కాదని, రాత్రి 9 అవగానే నిద్రపోయేదని రాజ్ కుంద్రా పేర్కొన్నారు.
తనకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే షమిత్ శెట్టిని పిలుస్తానని, తను నో చెప్పకుండా వచ్చేదని, బయటకు వెళ్లాలంటే ముందు షమిత పేరే వస్తుందని, అందుకే సమితాకు త్వరగా పెళ్లి కావాలని కోరుకోనని అతను చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.