Page Loader
Bigg Boss 7: 'బిగ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున
'బిబ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున

Bigg Boss 7: 'బిగ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున

వ్రాసిన వారు Stalin
Jul 24, 2023
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు 'బిగ్ బాస్ 7' ఆగస్టులో ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఆసక్తికర అప్టేట్ ఇచ్చారు. 6వ సీజన్ అనుకున్నంత సక్సెస్ కాకపోడవంతో 7వ సీజన్‌కు హైప్ తీసుకొచ్చేందుకు నిర్వహాకులు ప్రయత్నిస్తున్నారు. అందుకే షో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. తాజాగా 'బిగ్ బాస్ 7' సీజన్ ప్రారంభానికి ముందు బిగ్ బాస్ షైనింగ్ స్టార్స్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. సుమ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో కింగ్ నాగార్జన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. షైనింగ్ స్టార్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గత 6 సీజన్స్‌లో భాగమైన కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ సీజన్స్‌లోని అనుభవాలను పంచుకోనున్నారు.

బిగ్ బాస్

'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అని నాగార్జున ఎందుకు అన్నారంటే?

షైనింగ్ స్టార్స్ ప్రోమోలో నాగార్జున 'బిగ్ బాస్ 7'కు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'బిగ్ బాస్ 7' టీజర్‌లో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్ని నాగార్జున అన్నారు. ఇలా ఎందుకు అన్నారు అని నాగార్జునను సుమ అడిగారు. నాగార్జున ఈ విధంగా స్పందించారు. ఇందులో కొత్త రూల్స్, కొత్త ఛాలెంజెస్, కొత్త గేమ్స్ ఉంటాయని స్పష్టం చేశారు. నాగార్జున చెప్పిన ఈ మాటల ఆధారంగా 'బిగ్ బాస్ 7'ను నిర్వాహకులు సరికొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 7వ సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జునను మార్చి, కొత్త స్టార్‌ను నిర్వాహకులు తీసుకొస్తున్నారనే టాక్ వినిపించింది. కానీ అలాంటిది ఏమీ లేకుండా, మళ్లీ హోస్ట్ బాధ్యతను కింగ్ నాగార్జునకే అప్పగించారు.