
తెలుగు, తమిళంలో మహావీరుడు షోస్ క్యాన్సిల్: అసలేం జరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
శివ కార్తికేయన్ గత కొన్ని రోజులుగా తెలుగు మార్కెట్ మీద బాగా దృష్టి పెట్టాడు. ఆయన సినిమాలకు ఇక్కడ మంచి వసూళ్ళు వస్తున్నాయి కూడా.
ప్రస్తుతం మహావీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ కార్తికేయన్.
ఈరోజు రిలీజైన ఈ చిత్ర షోస్ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. తమిళం, తెలుగులో మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి.
కంటెంట్ రావడంలో ఆలస్యం కావడంతో షోస్ క్యాన్సిల్ అయ్యాయని సమాచారం.
మహావీరుడు సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో మహావీరుడు ఓపెనింగ్స్ బాగుంటాయని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా కంటెట్ రావడం ఆలస్యం కావడంతో షోస్ క్యాన్సిల్ అయిపోయి ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది.
Details
దర్శకుడు శంకర్ కూతురు హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ
మరి మార్నింగ్ షొస్ క్యాన్సిల్ అయ్యాక మ్యాట్నీ షోస్ అయినా ప్రదర్శితమవుతాయా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ బుకింగ్స్ చేసుకున్నవారు ఇబ్బంది పడుతున్నారు.
మహావీరుడు సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా కనిపిస్తోంది. హీరోయిన్ గా అదితి నటించిన రెండవ చిత్రం ఇది. ఆమె నటించిన మొదటి చిత్రం విరుమాన్, గతేడాది ఆగస్టులో రిలీజైంది.
శాంతి టాకీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను మడోన్నె అశ్విన్ తెరకెక్కించారు. తెలుగు నటుడు సునీల్, ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.