Page Loader
RC16: రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..?
RC16: రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..?

RC16: రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్,ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయబోతున్న సంగతి తెలిసిందే. RC 16లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ మూవీ షూటింగ్ ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో మొదలు పెట్టబోతున్నారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ సహ-నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details 

శంకర్ షణ్ముగం దర్శకత్వంలో రామ్ చరణ్

కాగా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ షణ్ముగం దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. సెప్టెంబర్ 2024 లో ఈ సినిమా విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.