
Shivarajkumar: 'పెద్ది' సినిమాలో శివన్న దుమ్ము దులిపే లుక్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా 'పెద్ది' నుంచి శనివారం ఓ స్పెషల్ అప్‌డేట్ వచ్చింది. కన్నడ సినీ దిగ్గజం శివరాజ్‌కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని,చిత్రబృందం ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. ఇందులో ఆయన 'గౌర్నాయుడు' పాత్రలో కనిపించనున్నారు. లుక్‌ను బట్టి చూస్తే, శివన్న గ్రామ పెద్దలా, ఆహార్యంతో, గంభీరమైన హావభావాలతో కనిపించనుండడం స్పష్టంగా తెలుస్తోంది. ఈ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందని చిత్రబృందం తెలిపింది.హ్యాపీ బర్త్‌డే డియర్ శివన్న. మీలాంటి లెజెండరీ వ్యక్తితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. మీరు సెట్‌లో ఉన్నప్పుడల్లా స్పూర్తినిస్తారు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాలో ఓ హృదయపూర్వక సందేశం షేర్ చేశారు.
Details
పల్లెటూరి నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్ కథ
రామ్‌చరణ్ కెరీర్‌లో ఇది 16వ సినిమా. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫిక్షనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు ఓ సందర్భంలో మాట్లాడుతూ, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఫిక్షనల్ కథ అని వెల్లడించారు. శివన్న పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సినిమాలో భాగమవడం పట్ల శివరాజ్‌కుమార్ గతంలో స్పందిస్తూ ఇందులో నా పాత్రకు విశేష ప్రాధాన్యం ఉంది. గౌర్నాయుడు పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. సినిమాలో మరో ముఖ్య పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు.
Details
భారీ నిర్మాణ సంస్థలతో భారీ చిత్రం
మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉండబోతోందన్న సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ పవర్‌ప్యాక్డ్ సినిమా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్, శివన్న పాత్రతో సినిమా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది.