Shivathmika: ఆ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్..నెపోటిజంపై ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుమార్తెగా 'దొరసాని' సినిమాతో శివాత్మిక రాజశేఖర్ సినీ రంగంలో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే తన నటన ద్వారా విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఆమె, ప్రస్తుతం కెరీర్‌లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సినీ పరిశ్రమలో నెపోటిజం, అవకాశాల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు.
వివరాలు
అదంతా మొదటి సినిమా వరకే..
శివాత్మిక మాట్లాడుతూ, "రాజశేఖర్ కుమార్తె అనే గుర్తింపు వల్ల దర్శకులను కలవడం కొంత సులభం అవుతుంది. అయితే, ఆ తరువాత అవకాశాలు రావడం పూర్తిగా నా ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. నెపోటిజం మొదటి సినిమా వరకు మాత్రమే సహాయపడుతుంది. ఆ తర్వాత ప్రతి సినిమా మన కెరీర్‌ను నిర్ణయిస్తుంది. 'దొరసాని' చిత్రం కారణంగా నాకు 'రంగమార్తాండ'లో అవకాశం లభించింది, కానీ అది నా కుటుంబ నేపథ్యం వల్ల కాదు.
వివరాలు
కంటెంట్ క్రియేటర్ కాదంటూ ఫైర్..
నేను రాజశేఖర్ కుమార్తెని తెలిసినా, కొన్ని ప్రాజెక్టుల నుంచి నన్ను తప్పించి మరొకరిని ఎంపిక చేశారు. కారణం అడిగితే, వారికి నాకంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారని చెప్పారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా నటీనటులను ఎంపిక చేయడం సరైంది కాదని నేను భావిస్తున్నాను. నేను ఒక నటి, కంటెంట్ క్రియేటర్ కాదు. నటన చేయగలనా లేదా? ఆ పాత్రకు సరిపోతానా లేదా? అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి గానీ, ఫాలోవర్ల సంఖ్యను కాదు" అని పేర్కొన్నారు.