Page Loader
AM Ratnam: రిలీజ్‌కు ముందు 'హరి హర వీరమల్లు'కు షాక్‌.. నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్ల ఫిర్యాదులు!
రిలీజ్‌కు ముందు 'హరి హర వీరమల్లు'కు షాక్‌.. నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్ల ఫిర్యాదులు!

AM Ratnam: రిలీజ్‌కు ముందు 'హరి హర వీరమల్లు'కు షాక్‌.. నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్ల ఫిర్యాదులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)కు చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఆయనపై రెండు వేర్వేరు డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (TFCC)లో అధికారికంగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులకు సంబంధించి రెండు సినిమాల విషయంలో ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన బకాయిలను ఇప్పటి వరకు రత్నం చెల్లించలేదని సంస్థలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో 'ఆక్సిజన్‌' సినిమాకు సంబంధించి రూ.2.5 కోట్ల రికవరీ కోసం ఏషియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అలాగే 'ముద్దుల కొడుకు', 'బంగారం' చిత్రాలకు సంబంధించిన రూ.90 వేల రికవరీ కోసం మహాలక్ష్మీ ఫిల్మ్స్‌ TFCCకి ఫిర్యాదు చేశాయి.

Details

ఈనెల 24న రిలీజ్

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన రత్నం తాజా చిత్రం 'హరి హర వీరమల్లు' ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ఆ సినిమా విడుదలకు ముందు తమ బకాయిలు వసూలు చేయాలని కోరుతున్నాయి. ఈ విషయంలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు సహకరించాలని కోరడమే కాక, ఫిల్మ్‌ ఛాంబర్‌ సైతం తగిన చర్యలు తీసుకోవాలనే అభ్యర్థనను సమర్పించాయి. ఈ చిత్రాన్ని రత్నం కుమారుడు జ్యోతికృష్ణ, దర్శకుడు క్రిష్‌ కలిసి తెరకెక్కించారు. సినిమా విడుదల సమీపిస్తున్న వేళ, బాకీ వివాదం కలకలం రేపుతోంది.