Page Loader
Shraddha Kapoor : ప్రేమలో పడ్డ శ్రద్ధా కపూర్!.. వైరల్‌గా మారిన నటి కామెంట్స్ 
ప్రేమలో పడ్డ శ్రద్ధా కపూర్!.. వైరల్‌గా మారిన నటి కామెంట్స్

Shraddha Kapoor : ప్రేమలో పడ్డ శ్రద్ధా కపూర్!.. వైరల్‌గా మారిన నటి కామెంట్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

'స్త్రీ 2' విజయాన్ని ఆస్వాదిస్తున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలకు పాల్గొంటున్నారు. ఆమె తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భాగస్వామితో విలువైన సమయాన్ని గడపడం, అతనితో కలిసి సినిమాలు చూడటం, డిన్నర్‌కు వెళ్లడం, ప్రయాణం చేయడం తనకు చాలా ఇష్టమని శ్రద్దా పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్నామా లేదా దాని కంటే సరైన వ్యక్తితో జీవితం కొనసాగిస్తున్నామా అనేది చాలా ముఖ్యమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. శ్రద్ధా కపూర్, బాలీవుడ్ రచయిత రాహుల్‌తో రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్‌లలో హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

Details

రూ.800 కోట్లకు వసూలు చేసిన స్త్రీ 2

అయితే ఇటీవల శ్రద్ధా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌ను అన్‌ఫాలో చేయడంతో, వారి బ్రేకప్ గురించి వార్తలొచ్చాయి. అయితే ఆమె చెప్పింది రాహుల్ గురించేనా, లేక వేరే వ్యక్తి గురించా అనేది తెలియాల్సి ఉంది. 2018లో వచ్చిన 'స్త్రీ' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'స్త్రీ 2', రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దాదాపు రూ. 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.