Page Loader
Shruti Haasan: ప్రియుడితో శృతి హసన్ పెళ్లి.. క్లారిటీ!
ప్రియుడితో శృతి హసన్ పెళ్లి.. క్లారిటీ!

Shruti Haasan: ప్రియుడితో శృతి హసన్ పెళ్లి.. క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2023
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruti Haasan) తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్ గా కాకుండా ప్లే బ్యాక్ సింగర్ కూడా శృతి హాసన్ రాణించింది. ఈ ఏడాది ఆమె చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. ఇక సలార్ ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా.. శృతి హాసన్ సీక్రెట్ పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ హజరికను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తలపై శృతి హాసన్ స్పందించారు. తనకి ఇంకా పెళ్లి కాలేదని, పెళ్లి అయిన విషయం ఎందుకు దాస్తానని, ఇకనైనా ట్రోలర్స్ శాంతించాలని శ్రుతి హాసన్ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శృతి హాసన్ చేసిన ట్వీట్