Shyam Prasad Reddy: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ ప్రొడ్యూసర్ భార్య కన్నుమూత
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) ఇవాళ కన్నుముశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌గా ఆమె బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు
వరలక్ష్మి మృతిపై ప్రముఖుల సంతాపం
వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ స్థాపించి పలు సీరియల్స్‌తో పాటు టీవీ కార్యక్రమాలను నిర్వహించారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.