Siddharth-Adithi Rao Hydari: వివాహ బంధంతో ఒక్కటైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో ఈ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ కలిసి ఏడు అడుగులు వేశారు. ఈ సందర్భంగా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 'నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే' సిద్ధార్థ్ పై ఉన్న ప్రేమను అదితి రావు చాటుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చాలా సింపుల్ గా సిద్ధార్థ్, అదితి వివాహం
వీరి వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో జరిగింది. సిద్ధార్థ్, అదితి చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అదితి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడో వెల్లడించిన విషయం తెలిసిందే. నాన్నమ్మ అంటే చాలా ఇష్టమని, హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించిందన్నారు. అక్కడే చాలా రోజులు గడిపానని, అయితే ఆమె కొన్నేళ్లక్రితం ఆమె మృతి చెందారు. ఈ విషయం సిద్ధార్థ్‌కు కూడా తెలుసు అని, అప్పుడు తన వద్దకు వచ్చి ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడని, అప్పుడే మార్చిలో తామిద్దరం అక్కడికి వెళ్లామన్నారు. అక్కడ మోకాళ్లపై కూర్చొని.. సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని అదితి వివరించింది.