ఆమెను చూడగానే కన్నీళ్ళు పెట్టుకుని కాళ్ళమీద పడిపోయిన సిద్ధార్థ్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. నిలదొక్కుకోవడం అటుంచితే ముందుగా అవకాశం రావడమే గగనం. అలాంటి అవకాశాన్ని పిలిచి మరీ ఇవ్వడమంటే నిజంగా అదృష్టమే. ఆ అదృష్టం హీరో సిద్ధార్థ్ కి దక్కింది.
గతకొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో సిద్ధార్థ్ కనిపించలేదు. తమిళ సినిమాలనే తెలుగులో డబ్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్ నటించిన చిత్రం టక్కర్, ఈరోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టక్కర్ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొన్న సిద్ధార్థ్, ఒకానొక ఛానల్ వారు ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో పాల్గొన్నాడు. అక్కడ సిద్ధార్థ్ కు సర్ప్రైజ్ ఎదురైంది.
సిద్ధార్థ్ మొదటి సినిమా బాయ్స్ లో అవకాశం రావడానికి కారణమైన సుజాత రంగరాజన్, అక్కడికి వచ్చారు.
Details
ఆమె వల్లే బాయ్స్ సినిమాలో అవకాశం
స్టేజి మీద సుజాత రంగరాజన్ ను చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్థ్. ఏకంగా కాళ్ళమీద పడిపోయాడు.
బాయ్స్ సినిమాకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిరత్నం దగ్గర పనిచేసేవాడు సిద్ధార్థ్. ఆ టైమ్ లో ప్రఖ్యాత రచయిత సతీమణి అయిన సుజాత రంగరాజన్, శంకర్ చేయబోయే బాయ్స్ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ బాగుంటాడని శంకర్ కు సలహా ఇచ్చారు.
సిద్ధార్థ్ కు హీరోగా చేయడం ఇష్టం లేకపోయినా, శంకర్ ఫోన్ చేసి ఫోటోషూట్ కోసం రమ్మంటే వెళ్లాడు. అలా బాయ్స్ సినిమాలో హీరోగా ఎంపికయ్యాడు.
అదే ప్రోగ్రామ్ లో సుజాత రంగరాజన్ గురించిన మాట్లాడిన సిద్ధార్థ్, ఆరోజు బాయ్స్ సినిమాలో అవకాశం రాకపోతే నా జీవితం వేరేలా ఉండేదని ఎమోషనల్ అయ్యాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎమోషనల్ అయిన సిద్ధార్థ్
She's Sujatha,and she only recommended actor siddharth to director shankar for boys movie...♥️ pic.twitter.com/4VwaUA8pUM
— poorna_choudary (@poornachoudary1) June 7, 2023