
సిద్ధార్థ్ టక్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయిన హీరో సిద్ధార్థ్, రీసెంట్ గా టక్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం, తెలుగు, తమిళంలో విడుదలైంది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్, టక్కర్ సినిమాలో వైవిధ్యంగా కనిపించాడు. థియేటర్లలో పెద్దగా అలరించలేకపోయిన ఈ సినిమా, ప్రస్తుతం ఓటీటీలో సందడి చేయడానికి వస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో జులై 7వ తేదీ నుండి టక్కర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా సమాచారం వచ్చేసింది.
థియేటర్లలో సినిమా మిస్సయిన వారు ఇకపై నెట్ ఫ్లిక్స్ లో జులై 7నుండి చూడవచ్చు.
Details
టక్కర్ కథ ఏంటంటే?
చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగే యువకుడు, తన తన కష్టాలకు, అవమానాలకు కారణం డబ్బు లేకపోవడమే అని అనుకుంటాడు. అందుకే ఎలాగైనా రిచ్ ఐపోవాలని తహతహ లాడుతుంటాడు.
అయితే బాగా ధనవంతుడికి పుట్టిన హీరోయిన్ కి డబ్బంటే అసహ్యం ఉంటుంది. వీరిద్దరూ ఒకానొక పరిస్థితుల్లో కలుస్తారు. వాళ్ళెందుకు కలిసారు? వాళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టింది? డబ్బున్న అమ్మాయిని వెంబడిస్తున్న విలన్ల నుండి ఆమెను హీరో ఎలా కాపాడతాడు అనేదే కథ.
కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సుధాన్ సుందరం, జి జయరామ్ తెరకెక్కించారు. నివాస్ ప్రసన్న సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ టక్కర్
Siddharth’s #Takkar will be streaming from this July 7 in NETFLIX. pic.twitter.com/uFSc1NASlb
— Christopher Kanagaraj (@Chrissuccess) July 5, 2023