Page Loader
ఓటీటీలోకి నేను స్టూడెంట్ సార్ సినిమా.. జులై 14న ఆహాలో రిలీజ్
ఓటీటీలోకి నేను స్టూడెంట్ సార్ సినిమా

ఓటీటీలోకి నేను స్టూడెంట్ సార్ సినిమా.. జులై 14న ఆహాలో రిలీజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 04, 2023
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినిమా నేను స్టూడెంట్ సార్ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జులై 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకి రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు. హిరో గణేష్‌కు జోడీగా అవంతిక దస్సాని నటించింది. నాంది ఫేమ్‌ సతీష్ వర్మ చిత్రాన్ని నిర్మించగా, మహతి స్వరసాగర్‌ మ్యూజిక్ అందించాడు. గతేడాది దసరాకు పెద్ద సినిమాలతో బెల్లంకొండ గణేష్‌ పోటీ పడ్డాడు. ఈ నేపథ్యంలో స్వాతిముత్యం మూవీ గతేడాది అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో, కెరియర్ లోనే మొట్టమొదటి సినిమాగా బరిలోకి దిగిన గణేష్ కు ఈ సినిమా మంచి రివ్యూలనే అందించింది.

details

నేను స్టూడెంట్ సార్ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది 

అయినప్పటికీ బడా హీరోల ధాటికి కమర్షియల్‌గా సక్సెస్ కాలేక చతికిలపడిపోయింది. ఫలితంగా స్టార్ డమ్ ఉన్న సినిమాలతో పోటీ పడి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయింది. ఇక ఓటీటీలోనూ ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్సే వచ్చింది. చక్కటి ఫ్యామిలీ బ్యాకప్ ఉన్న సినిమాను సమయం సందర్భం చూసుకోకుండా విడుదల చేశారని ప్రేక్షకులు, నెటిజన్లు విమర్శించారు. తాజాగా గణేష్ రెండో సినిమా నేను స్టూడెంట్ సార్ టీజర్‌, ట్రైలర్లు సినిమాపై గూస్ బంప్స్ తెచ్చాయి. సుముద్రఖని, సునీల్‌ వంటి నటీనటులున్నా ఈ సినిమా ఆశించిన మేర కలెక్షన్లు వసూలు చేయలేకపోయింది. కథాంశంలో బలం ఉన్నప్పటికీ దాన్ని సరైన విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోవడమే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది.