Jack Trailer: సిద్ధూ జొన్నలగడ్డ.. 'జాక్' ట్రైలర్ విడుదల.. ట్రైలర్‌లో సిద్దు నోట బూతులు.. రెచ్చిపోయిన వైష్ణవి చైతన్య
ఈ వార్తాకథనం ఏంటి
సిద్దు జొన్నలగడ్డ తన తాజా సినిమా 'జాక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది.
బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎస్వీసీసీ బ్యానర్‌పై ఈ ప్రాజెక్టును నిర్మించారు.
ఇక తాజాగా 'జాక్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌లో సిద్దు జొన్నలగడ్డ బోల్డ్ డైలాగులతో దుమ్ము రేపాడు.
ట్రైలర్ కావడంతో కొన్ని వాడుక భాషా పదాలు సెన్సార్ కాకుండా వచ్చేశాయి. అయితే, సినిమా విడుదలకు ముందు ఈ డైలాగ్స్‌ను మ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిసిందే.
వివరాలు
సినిమాలో ఇంకా ఏదో కొత్త అంశం
ట్రైలర్ చూస్తే,లవ్,కామెడీ, యాక్షన్ మాత్రమే కాదు,సినిమాలో ఇంకా ఏదో కొత్త అంశం కూడా ఉందని అర్థమవుతోంది.
ముఖ్యంగా ప్రకాష్ రాజ్,సిద్దు మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.
కానీ,ఈ కథలో టెర్రరిస్ట్ కాన్సెప్ట్‌ను ఎలా మిళితం చేశారు? ఆ ట్రాక్ కథతో ఏ విధంగా ముడిపడింది? అనేది మాత్రం సినిమా చూసిన తరువాతే తెలియనుంది.
అలాగే, వైష్ణవి చైతన్య పాత్రకూ చాలా ప్రాముఖ్యత ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
సినిమాలో నరేష్ కామెడీ, సిద్దు టైమింగ్, శ్యామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అచ్చు రాజమణి సంగీతం సినిమాకు అదనపు బలంగా మారే అవకాశం ఉంది.
ఇక, చాలా కాలం తరువాత ప్రకాష్ రాజ్‌కు ఈ సినిమాలో కీలకమైన పాత్ర దక్కినట్టు కనిపిస్తోంది.
వివరాలు
'జాక్'పై భారీ అంచనాలు
'జాక్' ట్రైలర్ చూస్తే, ఇది న్యూ ఏజ్ కంటెంట్, హై టెక్నికల్ మేకింగ్‌తో రూపొందిన సినిమా అని తెలుస్తోంది.
బొమ్మరిల్లు భాస్కర్ ఈసారి హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' తరువాత బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తీసుకుని 'జాక్' సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
మరి, ఈ సినిమా ద్వారా ఆయన తన ఖాతాలో మరో హిట్ వేసుకుంటాడా? అనేది వేచిచూడాలి.
మరోవైపు, సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు.
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి సినిమాలతో హిట్ ట్రాక్‌లో దూసుకుపోతున్న అతని తాజా చిత్రం కావడంతో, 'జాక్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
𝐌𝐚𝐠𝐧𝐢𝐟𝐲𝐢𝐧𝐠 𝐬𝐮𝐬𝐩𝐞𝐧𝐬𝐞 𝐳𝐨𝐨𝐦𝐢𝐧𝐠 𝐢𝐧 𝐨𝐧 𝐦𝐚𝐝𝐧𝐞𝐬𝐬 💥💥#JackTrailer is now live with ENTERTAINMENT mode fully ON 🤟🏻
— SVCC (@SVCCofficial) April 3, 2025
— https://t.co/gHG3HCFYuK#Jack #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/95U3HCc5VJ