Page Loader
Kiara-Sidharth Malhotra: తండ్రైన సిద్ధార్థ్‌ మల్హోత్ర.. పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన కియారా అడ్వాణీ
తండ్రైన సిద్ధార్థ్‌ మల్హోత్ర.. పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన కియారా అడ్వాణీ

Kiara-Sidharth Malhotra: తండ్రైన సిద్ధార్థ్‌ మల్హోత్ర.. పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన కియారా అడ్వాణీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటులు కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ జంట పండంటి ఆడబిడ్డ జన్మించింది. ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో కియారా బిడ్డకు జన్మనిచ్చినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. తల్లి,శిశువు ఇద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఈ జంట ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన 'షేర్షా' సినిమాలో ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించగా,ఆ చిత్రం షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కియారా, 'కాఫీ విత్ కరణ్' సీజన్ 8లో తన ప్రేమకథను వివరించింది.ఇటలీలోని రోమ్ నగరంలో సిద్ధార్థ్ తనకు లవ్‌ ప్రపోజ్‌ చేసినట్లు చెప్పింది.

వివరాలు 

కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం 

ఆ తర్వాత, 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని ఓ రాజభవనంలో, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం కూడా ఈ జంట తమ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. కియారా నటించిన తాజా చిత్రం 'వార్ 2' ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పరమ్ సుందరి' సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. అదనంగా, అరునాభ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' అనే చిత్రంలో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన కియారా అడ్వాణీ