Siddu Jonnalagadda :కోహినూర్ వజ్రం కోసం సిద్ధూ.. పాన్ ఇండియా సినిమా అంటూ ప్రకటన!
సిద్ధూ జొన్నలగడ్డ, ఎన్నో ఏళ్ల తర్వాత 'డీజే టిల్లు'తో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్న సిద్ధూ, దసరా పండుగను పురస్కరించుకుని తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై, డైరెక్టర్ రవికాంత్ ప్రేరేపు దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'కోహినూర్ - పార్ట్ 1'ను అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్‌ను కూడా విడుదల చేయడంతో, ఈ సినిమా రెండు భాగాలుగా రావొచ్చని అంచనా వేస్తున్నారు.
2026లో మూవీ రిలీజ్?
పోస్టర్‌లో, రాజుల కాలం నేపథ్యంలో శిలా తోరణం మధ్య సిద్ధూ కత్తి పట్టుకుని, కోహినూర్ వజ్రం చేతిలో పట్టుకొని కన్పిస్తున్నాడు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ కథ, భద్రకాళి మాతతో సంబంధమున్న కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుంది. ఈ వజ్రం మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిపోవడం, దాన్ని తిరిగి తెచ్చేందుకు ఒక యువకుడు చేసే ప్రయత్నాల గురించి ఉంటుంది. అయితే ఈ కథలో రాజుల కాలం గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీని 2026 జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.