
Jack OTT Release: ఓటీటీలోకి సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్'.. మే 8 నుంచి స్ట్రీమింగ్ షురూ!
ఈ వార్తాకథనం ఏంటి
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'జాక్' (Jack) త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, ఇది స్పై, యాక్షన్, కామెడీ అంశాలతో మిళితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కింది.
వేసవి కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది.
తాజాగా ఈ చిత్రం ఓటిటి వేదికగా స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. మే 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'జాక్' సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Details
నాలుగు భాషల్లో రిలీజ్
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
తాజా అప్‌డేట్‌తో 'జాక్' సినిమా అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
థియేటర్లలో విజయం సాధించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ వేదికగా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!