
Venkatesh Daughter Engagement: సైలెంట్‌గా వెంకటేశ్ కూతురి ఎంగేజ్‌మెంట్.. ప్రముఖులు హాజరు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని నిశ్చితార్థం విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తనయుడితో బుధవారం జరిగింది.
వెంకటేష్ స్వగృహంలోనే హవ్యవాహిని నిశ్చితార్థ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఇక వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
హవ్యవాహిని ఎంగేజ్ మెంట్ వేడకలో చిరంజీవి, మహేష్ బాబు, రానా, నాగచైతన్య పాటు పలువురు టాలీవుడ్ హీరోలు సందడి చేశారు.
విక్టరీ వెంకటేష్, నీరజ దంపతులకు ఆశ్రిత, హవ్యవాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నాడు.
ఆశ్రితకు 2019లో వినాయక్ రెడ్డితో వివాహం జరిగిన విషయం తెలిసిందే.
Details
సైంధవ సినిమాతో వెంకటేష్ బిజీ
ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఈ సినిమాకు శైలేస్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలకపాత్రలలో నటిస్తున్నారు.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.