Ajay Devagan Injured : సింగం-3 సెట్'లో గాయపడ్డ అజయ్ దేవ్‌గణ్.. కంటికి తీవ్ర గాయం
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అజయ్ దేవ్‌గణ్ గాయపడ్డారు. ఈ మేరకు సింగం 3 షూటింగ్ సెట్'లో భాగంగా ఆయన కంటికి తీవ్రగాయం కలిగింది.
ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా అనుకోకుండా అజయ్ దేవ్‌గణ్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి కన్నుకు గాయమైనట్లు సమాచారం.
దీంతో అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే వైద్యబృందాన్ని హుటాహుటిన పిలిపించారు. ఈ క్రమంలోనే అజయ్ దేవ్‌గణ్ తన కంటికి చికిత్స చేయించుకున్నాడు.
కొద్ది సేపు విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు బాలీవుడ్‌లో పలు కథనాలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై దర్శకుడు రోహిత్ శెట్టి, హీరో అజయ్ దేవ్‌గణ్, చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయలేదు.
Details
సింగం-3 వాయిదా పడే అవకాశం
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న చిత్రం సింగం 3. సింగం సిరీస్‌లో మూడో భాగంగా రానున్న ఈ సినిమా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.
తొలి రెండు చిత్రాలు ఇప్పటికే ఘన విజయాలు అందుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందుకు తగ్గట్లే ఈ సినిమా నిర్మితమవుతోంది.ఈ మేరకు ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది.
సింగం-3లో కరీనా కపూర్, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.అయితే పుష్ప-2 సైతం అదే రోజున విడుదల కానున్న క్రమంలో విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.