LOADING...
Singer Kalpana: ప్రముఖ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం
ప్రముఖ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం

Singer Kalpana: ప్రముఖ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
09:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సహా దక్షిణాది భాషల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో వెంటనే పోలీసులు స్పందించి, ఆమెను స్థానిక హాలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పన నిజాంపేట పరిసరాల్లో నివాసం ఉంటోంది. ఆమె తన భర్తతో కలిసి నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ అపార్ట్‌మెంట్‌లో జీవిస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా ఆమె ఇంటి తలుపు ఓపెన్ చేయకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసుల్లో అనుమానం నెలకొంది.

వివరాలు 

వెంటిలేటర్‌పై చికిత్స

సందేహం పెరిగిన అపార్ట్‌మెంట్ నివాసితులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసుల రాకతో ఎంతమాత్రం స్పందించకపోవడంతో, వారు తలుపు బలవంతంగా తెరిచారు. అప్పటికే కల్పన అపస్మార స్థితిలో ఉండటంతో, వెంటనే స్థానిక హాలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, కల్పనకు స్పృహ వచ్చినట్లు సమాచారం. ఆమె నుండి స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆమె నిజంగా ఆత్మహత్యాయత్నం చేసిందా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే విషయం ఆమె ఇచ్చే స్టేట్‌మెంట్ ద్వారా స్పష్టత వచ్చే అవకాశముంది.