
ధనుష్ నటించిన సార్ మూవీ: మాస్టారు మాస్టారు అంటూ రికార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ హీరో ధనుష్ నటించిన సార్ మూవీ, ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ బ్లాక్ బస్టర్ అయ్యింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన ఈ చిత్రం అందరికీ నచ్చేసింది.
ఇదివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ధనుష్, సార్ సినిమాతో డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా సింపుల్ గా ఉండే ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా సార్ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు పాట సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. తెలుగు, తమిళ వెర్షన్లలో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
తెలుగు సినిమా
స్పాటిఫై మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లో 40 మిలియన్ల వ్యూస్
అవును, ఇటు తెలుగు వర్షన్ మాస్టారు మాస్టారు, అటు తమిళ వర్షన్ వా వాతి పాటకు కలిపి ఏకంగా 40మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా మ్యూజిక్ ప్లాట్ఫామ్ అయిన స్పాటిఫై లో కావడం విశేషం.
సార్ చిత్రానికి సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందించారు. మాస్టారు మాస్టారు తెలుగు వర్షన్ ని, తమిళ వర్షన్ ని శ్వేతా మోహన్ పాడారు. అయితే ఈ పాటకు తెలుగు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి అందించగా, తమిళ లిరిక్స్ హీరో ధనుష్ రచించారు.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపించింది. సముద్రఖని, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో మెరిశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్పాటిఫై మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లో 40 మిలియన్ల వ్యూస్
#VaaVaathi ~ #MastaaruMastaaru The Blockbuster Melody song ruling everyone’s playlists 🫰🏽
— Sithara Entertainments (@SitharaEnts) March 11, 2023
40 Million+ Streams on @spotifyindia ❤️🔥
A @gvprakash musical 🎶 @dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @ramjowrites @_ShwetaMohan_ @vamsi84 @adityamusic @SitharaEnts @7screenstudio pic.twitter.com/Ca4Z2XCOaK