తండ్రి మహేష్ బాబు బాటలో కూతురు సితార ఘట్టమనేని: బ్రాండ్ అంబాసిడర్ గా తొలి సంతకం
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని అందరికీ పరిచయమే. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది సితార. అయితే తాజాగా సితారకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ PMJ జువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సితార ఘట్టమనేని సంతకం చేసింది. బ్రాండ్ అంబాసిడర్ గా సితారకు మంచి రెమ్యునరేషన్ దక్కుతోందని సమాచారం. ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందనేది వెల్లడించలేదు కానీ పెద్ద మొత్తంలో రెమ్యురేషన్ అందిందని చెప్పుకుంటున్నారు. ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ షూట్ ఆల్రెడీ జరిగిపోయిందని, మూడు రోజులపాటు ఈ యాడ్ ను షూట్ చేశారని తెలుస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్ గా సరికొత్త చరిత్ర సృష్టించిన సితార
ఇంత చిన్న వయసులోనే ఒక పెద్ద బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేయడంతో సరికొత్త చరిత్రను సృష్టించింది సితార. ఇప్పటివరకు ఏ స్టార్ కిడ్ కూడా అతి పెద్ద బ్రాండ్ కి అతి తక్కువ వయసులో అంబాసిడర్ గా సంతకం చేయలేదు. సితార కనిపించే పీ ఎమ్ జే యాడ్, మరికొన్ని రోజుల్లో టీవీల్లో ప్రసారం కానుందని అంటున్నారు. అలాగే ఈ యాడ్ తాలూకు ప్రచార చిత్రాలు సోషల్ మీడియా సహా ఇతర మాధ్యమాల్లో మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి. అదలా ఉంచితే, మహేష్ బాబు సినిమా, సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ సాంగ్ లో సితార ఘట్టమనేని కనిపించింది.