Page Loader
Parasakthi Title Teaser: శివ కార్తికేయ‌న్ 'పరాశక్తి' టైటిల్ టీజర్ రిలీజ్!

Parasakthi Title Teaser: శివ కార్తికేయ‌న్ 'పరాశక్తి' టైటిల్ టీజర్ రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ ప్రపంచంలో వరుస విజయాలతో అగ్రనటుడిగా ఎదిగిన శివ కార్తికేయ‌న్, తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2021లో అతడి 'అమ‌ర‌న్' చిత్రంతో భారీ హిట్ కొట్టిన శివ కార్తికేయ‌న్, ఈ చిత్రంలో మ‌రోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇందులో ఆకాశం నీ హ‌ద్దురా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన తెలుగు దర్శకురాలు సుధా కొంగ‌ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్, డాన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. చిత్రంలో శివ కార్తికేయ‌న్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా విలన్‌గా జ‌యం ర‌వి, శ్రీలీల, అథ‌ర్వ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Details

స్టూడెంట్ లీడర్ గా శివ కార్తికేయన్

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మేకర్స్ ఇటీవల టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి పరాశక్తి అనే టైటిల్‌ను ఇచ్చారు. ఇది దివంగత నటుడు శివాజీ గణేష‌న్ నటించిన ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి సంబంధించిన పేరు. టీజర్ చూస్తే ఈ సినిమా 1960-70ల కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ ఇందులో స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నారు. టీజర్‌లో అతడు చెప్పిన 'సైన్యమై కదలిరా.. పెను సైన్యమై కదలిరా' అనే డైలాగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి సంగీతాన్ని జీవీ ప్రకాశ్ అందిస్తున్నారు.