Page Loader
బలహీనుడి నుంచి బలవంతుడి దాకా.. ఉత్కంఠ రేపుతోన్న మహావీరుడు ట్రైలర్ 
ఉత్కంఠ రేపుతోన్న మాహావీరుడు ట్రైలర్

బలహీనుడి నుంచి బలవంతుడి దాకా.. ఉత్కంఠ రేపుతోన్న మహావీరుడు ట్రైలర్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 03, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

శివ కార్తికేయన్ తొలి తెలుగు సినిమా ప్రిన్స్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో 3 సినిమాలను సెట్స్ పై ఉంచిన ఈ హీరో ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్నాడు. అందులో ఒకటిగా మహావీరుడు షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. మ‌డోన్ అశ్విన్, మహావీరుడి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్లు, టీజర్‌లు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. జూలై 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ట్రైలర్‌తోనే సినిమా కథంశాంపై చిత్ర బృందం చిన్న సన్నివేశాన్ని వివరించే ప్రయత్నం చేసింది. అత్యంత పిరికివాడైన ఓ కుర్రాడు, ధైర్యవంతుడిగా ఎలా మారాడన్న కథాంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామన్నారు.

DETAILS

ప్రత్యర్థులను వణికిస్తున్న మహావీరుడు 

అమాయకుడిగా నవ్వులను పంచిన ఓ యువకుడు, సంఘటనల ఆధారంగా బలపడి చివరకు తన ప్రత్యర్థులను ఏ స్థాయిలో బయపెట్టగలిగాడో ట్రైలర్ చూసిన వారికి అర్థమవుతుంది. మరోవైపు ప్రిన్స్ సినిమా చేదు ఫలితాన్ని నటుడు శివ కార్తికేయన్‌ సైతం అంగీకరించారు. డాక్టర్‌, డాన్‌ వంటి వరుస వంద కోట్ల సినిమాల అనంతరం శివ కార్తికేయన్‌కు ప్రిన్స్‌ సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జాతిరత్నాలు లాంటి బంపర్‌ హిట్ తర్వాత అనుదీప్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇదే. దీంతో రిలీజ్‌కు ముందే సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. తెలుగులో చతికిలపడినా తమిళంలో మాత్రం పర్వాలేదనిపించింది.అక్కడ మోస్తరు కలెక్షన్‌లను సాధించింది.