LOADING...
Nara Rohith: ఆరేళ్ల కష్టం 'సుందరకాండ'లో దాగి ఉంది.. నారా రోహిత్
ఆరేళ్ల కష్టం 'సుందరకాండ'లో దాగి ఉంది.. నారా రోహిత్

Nara Rohith: ఆరేళ్ల కష్టం 'సుందరకాండ'లో దాగి ఉంది.. నారా రోహిత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

నారా రోహిత్ హీరోగా, వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సుందరకాండ' సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో నారా రోహిత్ మాట్లాడుతూ సుందరకాండ చిత్ర షూటింగ్‌ రోజులు నాకు ఎప్పటికీ మరిచిపోలేనివి. దర్శకుడు వెంకటేశ్‌ కారణంగానే ఈ సినిమా ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఒక డైరెక్టర్ హీరోపై నమ్మకం ఉంచి ఇంత కాలం పాటు అతనితో ప్రయాణం చేస్తాడా అన్న సందేహం నాకుంది. కానీ, వెంకీ మాత్రం ఈ సినిమా కోసం నాతో ఆరు సంవత్సరాలు పాటు గడిపాడు.

Details

కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది

ఈ చిత్రం కచ్చితంగా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. కొంతమంది నాపై కోపంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. వాళ్లకు నేను నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ సినిమా అనేది ఒకరి కృషి కాదు.. దాని వెనక ఎన్నోమంది శ్రమ ఉంటుంది. నా మీద కోపం ఉంటే సినిమాని నచ్చలేదని రాయండి, ఫర్వాలేదు. కానీ ముందుగా థియేటర్‌లో చూసి రాసే హక్కు మీకు ఉంది. నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పండి. కానీ చూడకుండానే రాయొద్దు. నేను అడుగుతున్న ఒక్కటి ఇదే అని రోహిత్‌ స్పష్టం చేశారు.

Details

ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడం చాలా కష్టం

మంచు మనోజ్ మాట్లాడుతూ— సుందరకాండ కోసం దర్శకుడు వెంకటేశ్ చాలా కష్టపడ్డాడు. రోహిత్ కూడా 'భైరవం' సెట్‌లో ఎప్పుడూ ఈ సినిమా గురించి మాట్లాడేవాడు. ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంత కష్టం అనేది బయటివాళ్లకు తెలియదు. దానివెనక ఎన్నో త్యాగాలు, ఎన్నో ఒడిదుడుకులు దాగి ఉంటాయి. బయటివాళ్లు ఈజీగా 'సినిమా వాళ్లులే' అని అనేస్తారు కానీ దానివెనక ఉన్న శ్రమ అసలు అర్థం చేసుకోరు. ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంతంగా ఈస్థాయికి రావడం సాధారణ విషయం కాదు. ఇక శ్రీదేవి, నేను చిన్నప్పటి నుంచే కలిసే పెరిగాం. చెన్నైలో ఆమె పెద్ద రౌడీ లాంటిది. నన్ను సరదాగా ర్యాగ్ చేసేదని మనోజ్ హాస్యంగా గుర్తుచేశారు.