
స్కంద మొదటి పాట: సిద్ శ్రీరామ్ పాటకు రామ్ పోతినేని, శ్రీలీల ఖతర్నాక్ స్టెప్పులు
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ పోతినేని కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న స్కంద నుండి మొదటి పాట రిలీజైంది.
నీ చుట్టు చుట్టూ తిరిగినా, నా చిట్టి చిట్టి గుండెనడిగినా అంటూ సాగే పాటలో రామ్ పోతినేని, శ్రీలీల స్టెప్పులు అదుర్స్ అనిపిస్తున్నాయి.
సిద్ శ్రీరామ్ గొంతు కారణంగా పాటకు సరికొత్త అందం వచ్చింది. క్లాస్, మాస్ కలగలిసిన ట్యూన్ తో వినసొంపుగా ఉంది.
కంగారుగా కలగదయ్యొ కైపు, నేనస్సలే కాదు నీ టైపు, ఇలాంటివెన్ని చూడలేదు కళ్లముందరా వంటి లిరిక్స్ తో పాడుకోవడానికి వీలుగా ఉంది.
ఈ పాటకు సాహిత్యాన్ని రఘురామ్ అందించగా, సంగీతాన్ని థమన్ సమకూర్చారు. సిద్ శ్రీరామ్ తో కలిసి సంజనా కాల్మంజే పాడారు.
Details
ఐదు భాషల్లో రిలీజైన పాట
నీ చుట్టు చుట్టు పాటను తెలుగు సహా, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ చేసారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
గతకొన్ని రోజులుగా రామ్ పోతినేని సరైన హిట్ అందుకోలేక పోయాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నుండి వచ్చిన రెడ్, ది వారియర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
మరి బోయపాటి మాస్ మంత్రం, రామ్ పోతినేనికి హిట్ అందిస్తుందేమో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాట రిలీజ్ పై నిర్మాణ సంస్థ ట్వీట్
Let's Go CRAZY & Start dancing 🕺 to the "Blazing Song of the Season"🥁🔥#NeeChuttuChuttu - https://t.co/WY4oAYrW7V#MainPeechePeeche - https://t.co/SjcVTplHQy#OnaSuthiSuthi - https://t.co/ifyuhtcmIw#NinSutthaSuttha - https://t.co/LMn1YEa3Ev#NeeThottuThotta -… pic.twitter.com/O9CgCTi2jk
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 3, 2023