
Bakasura Restaurant : చిన్న సినిమా పెద్ద విజయం.. ఓటీటీ ట్రెండింగ్‌లో చిన్న సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
హాస్య నటుడు ప్రవీణ్ హీరోగా నటించిన హారర్-కామెడీ చిత్రం 'బకాసుర రెస్టారెంట్' ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్‌కి వచ్చింది. కామెడీ, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం, ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న టాప్ ట్రెండింగ్ తెలుగు సినిమాల్లో నాలుగో స్థానంలో దూసుకెళ్లింది. డిజిటల్ రిలీజ్‌కి మూడు రోజుల లోపే ఈ రికార్డ్ అందుకోవడం విశేషం. ప్రవీణ్‌తో పాటు హర్ష చెముడు, షైనింగ్ ఫణి, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని కామెడీ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది.
Details
టాప్ 4లో ట్రెండింగ్
అందుకే రికార్డు స్థాయి వ్యూస్‌తో అమెజాన్ ప్రైమ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ 4లో నిలిచింది. ప్రైమ్ వీడియోలో సెన్సేషన్ సృష్టించిన 'బకాసుర రెస్టారెంట్' తాజాగా మరో ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సన్ NXTలో కూడా ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 13 నుంచి సన్ NXTలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ రాబడుతోంది. హారర్, కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని యూనిట్ ముందుగానే చెప్పింది. ప్రస్తుతం అందుకు తగ్గట్టే ఓటీటీలో గ్రాండ్ సక్సెస్‌గా దూసుకెళ్తోంది.