Tollywood Release : ఈ వారం టాకీసుల్లో బుల్లి సినిమాలతో పాటు మెగా సినిమా.. అవేంటో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి ఈవారంలో చిన్న సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని రంజింపజేయనున్నాయి.
కీడా కోలా :
బ్రహ్మానందం, చైతన్యరావు, రాగ్‌మయూర్ తారగణంతో రూపొందిన కీడాకోలా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ కీలక పాత్రలోనూ మెప్పించనున్నాడు. హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ చిత్రం విడుదల కానుంది.
మా ఊరి పొలిమేర 2 :
సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శీను, కామాక్షి భాస్కర్ల నటించిన మా ఊరి పొలిమేర 2, నవంబర్ 3న ప్రేక్షకులను పలకరించనుంది.
DETAILS
వచ్చే శుక్రవారం ఏమేం సినిమాలు విడుదల కానున్నాయో తెలుసా
మా ఊరి పొలిమేరకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కించారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.
నరకాసుర
పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నరకాసుర మూవీ వచ్చే శుక్రవారం తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోనుంది.
సామాజిక కథకు, కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా దర్శకత్వంలో సంకీర్తన విపిన్, అపర్ణ జనార్ధన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విధి :
రోహిత్ నందా, ఆనంది జంటగా తెరకెక్కిన ఈ టిత్రానికి దర్శకులు శ్రీనాథ్, శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందింది. ఈ శుక్రవారం థియేటర్లలో అడుగుపెట్టనుంది.
Details
నవంబర్ 4న మెగాస్టార్ సినిమా మరోసారి విడుదల
వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా నటించిన ఫ్లాట్ మూవీ శని, ఆదివారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది.
ప్లాట్ సినిమాకు భవ తారక దర్శకత్వం వహించాడు. నవంబర్ 3న కృష్ణ ఘట్టం, ఒక్కసారి ప్రేమించాక సినిమాలు సైతం రిలీజ్ కానున్నాయి.
మరోసారి థియేటర్లలోకి శంకర్‌దాదా ఏంబీబీఎస్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఏంబీబీఎస్ మరోసారి రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు నవంబర్ 4న థియేటర్లలో విడుదలకు సిద్దంగా ఉంది.
జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాలి బింద్రే కథానాయికగా ఆడిపాడింది. ఈ రీమేక్ సినిమాలో నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో మెరిశాడు.