Page Loader
RC 16: రామ్‌చ‌ర‌ణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన.. కుంభామేళా సెన్సెష‌న్‌ మోనాలిసా భోంస్లే..!
రామ్‌చ‌ర‌ణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన.. కుంభామేళా సెన్సెష‌న్‌ మోనాలిసా భోంస్లే..!

RC 16: రామ్‌చ‌ర‌ణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన.. కుంభామేళా సెన్సెష‌న్‌ మోనాలిసా భోంస్లే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను చూసినా ఆమె ట్రెండింగ్‌లో ఉంది. మోనాలిసా అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోంస్లే తన అందంతో ఇంత వరకు చూసిన వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహా కుంభమేళాలో రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముతూ, సోషల్‌ మీడియాలో రీల్స్‌ పోస్ట్ చేస్తూ వెలుగు చూసిన ఈ మోనాలిసా భోంస్లే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. మొదటి సారి రామ్‌ చరణ్‌తో కలిసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమాలో చెర్రీ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోనాలిసాను కూడా ఈ చిత్రంలో భాగం చేయబోతున్నారు.

వివరాలు 

మోనాలిసా అందాలకు యూత్‌ ఫిదా

జాన్వీ కపూర్‌ పాత్ర ఇప్పటికే ఖరారైంది, అయితే మోనాలిసాకు ఏ రోల్ ఇస్తారనే దాని గురించి ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా మోనాలిసా అందాలకు యూత్‌ విపరీతంగా ఫిదా అయిపోతోంది, కాబట్టి RC16లో ఆమెకు మంచి పాత్ర వచ్చినా, ఇది చరణ్‌ పాన్‌ ఇండియా సినిమాకు తగినట్లుగా ఉండవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గేమ్‌చేంజర్‌ తర్వాత, రామ్‌చరణ్ బుచ్చిబాబుతో కలిసి సినిమా చేయబోతున్నాడు. RC16 కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతుందని చెప్పబడుతోంది. ఈ సినిమా పై భారీ హైప్ ఇప్పటికే క్రియేట్ అయింది.

వివరాలు 

మోనాలిసాతో ఇంటర్వ్యూలు.. క్యూ కట్టిన  నేషనల్ మీడియా

మోనాలిసాను ఈ సినిమాలో తీసుకుంటే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జనవరి 27 నుండి RC16 సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. జూలై నెలలో షూటింగ్ పూర్తిచేసి దసరాకు సినిమా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మోనాలిసాతో ఇంటర్వ్యూలు చేస్తుండగా, నేషనల్ మీడియా కూడా ఆమెను ప్రశ్నలు అడగడానికి క్యూ కట్టింది. కుంభమేళా కారణంగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌కి వచ్చిన ఈ యువతి, ఇప్పుడు ఓ సినిమా అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదీ కూడా మన తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.