NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Daaku Maharaj: అంచనాలు పెంచేస్తున్న డాకు మహారాజ్.. ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్న బిగ్ స్టార్
    తదుపరి వార్తా కథనం
    Daaku Maharaj: అంచనాలు పెంచేస్తున్న డాకు మహారాజ్.. ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్న బిగ్ స్టార్
    ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్న బిగ్ స్టార్

    Daaku Maharaj: అంచనాలు పెంచేస్తున్న డాకు మహారాజ్.. ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్న బిగ్ స్టార్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 20, 2024
    10:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తరువాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న తదుపరి సినిమా NBK109.

    ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ముందు ఈ సినిమాకు అనేక పేర్లు ప్రచారంలో వచ్చినప్పటికీ, తాజాగా 'డాకు మహారాజ్' అనే పేరు ఖరారు చేసారు.

    చిత్ర బృందం దీనిని అధికారికంగా ప్రకటిస్తూ, టైటిల్‌తో పాటు ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

    నాగ వంశీ స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని కావడంతో, ఈ సినిమాపై ఆయన కూడా ప్రత్యేకమైన అంచనాలను పెట్టారు.

    ఈ సినిమా నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరింత భారీ అంచనాలతో కూడుకున్న చిత్రంగా నిలుస్తోంది.

    వివరాలు 

    డాకు మహారాజ్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్

    ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్. గతంలో 'అఖండ' వంటి భారీ విజయం తర్వాత, ఇప్పుడు ఈ సినిమా కూడా అదే మ్యాజిక్‌ను పునరావృతం చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

    తాజాగా, నాగ వంశీ ఈ టీజర్‌ను చూసిన తర్వాత, తమన్ మ్యూజిక్ ఎందుకు అనివార్యమో తెలిపారు. ఈ టీజర్ ఇప్పుడే మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

    ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్ర శరవేగంగా షూటింగ్ జరుగుతుండగానే ఒక వార్త వైరల్ అవుతోంది.

    డాకు మహారాజ్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

    ఈ మేరకు, ట్రైలర్‌ను జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో విడుదల చేయాలని భావిస్తున్నారు.

    వివరాలు 

    ఈవెంట్ కి బిగ్ స్టార్లకు ఆహ్వానం 

    ఆ ఈవెంట్‌లో ప్రత్యేకంగా, బిగ్ స్టార్లను కూడా ఆహ్వానించాలని చూస్తున్నారు. ఈ విధంగా, డాకు మహారాజ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలవడానికి అన్ని సూచనలు కనిపిస్తున్నాయి.

    ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలకృష్ణ

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    బాలకృష్ణ

    బాలకృష్ణ 108వ సినిమా: టైటిల్ రివీల్ కోసం 108లొకేషన్లు  తెలుగు సినిమా
    భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు  శ్రీలీల
    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  భగవంత్ కేసరి
    హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ: ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025