రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో సాంగ్ లీక్.. తమన్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!
శంకర్ డైరక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి సాంగ్ లీకైందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రుమఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజ్, ఆయన సోదరుడు శిరిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాటలకే కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీ నుండి 'జరగండి.. జరగండి.. జరగండి.. జాబిలమ్మ జాకెట్ వేసుకొని వచ్చెనండీ' అనే ఓ సాంగ్ లీకైంది. దీంతో నెటిజన్లు తమన్ పై ట్రోల్స్ మొదలు పెట్టారు.