
Gopichand: గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది 'భీమా', 'విశ్వం' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నటుడు గోపీచంద్ ప్రస్తుతం తన 33వ సినిమాతో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. 'ఘాజీ', 'అంతరిక్షం 9000 KMPH' వంటి ప్రయోగాత్మక చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు..దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ చారిత్రక నేపథ్యంపై ఆధారపడి ఉండనుందని సమాచారం. ముఖ్యంగా గోపీచంద్ ఇప్పటివరకు ఎప్పుడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ చుట్టూ ఇంటర్నెట్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
వివరాలు
'Gopichand33' వర్కింగ్ టైటిల్
ఈ సినిమాకు 'శూల' అనే టైటిల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. 'శూల' అనే పదం ఒక ప్రదేశాన్ని సూచించేదిగా ఉండగా, కథలో ఆ ప్రదేశానికి కీలకమైన ప్రాధాన్యత ఉంటుందని ఫిలింల వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ టైటిల్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం 'Gopichand33' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కథానాయికగా రితికా నాయక్ నటిస్తోంది.