Javed Akhtar - Aamir Khan: దక్షిణాది హీరోలు హిందీలో రూ.700 కోట్లు రాబడుతున్నారు.. బాలీవుడ్ వెనుకబాటుకు కారణమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఒకే రకమైన యాక్షన్ కథలతో విసుగు చెందిన హిందీ ప్రేక్షకులకు దక్షిణాది సినిమాలు కొత్త రుచిని అందిస్తున్నాయి.
అయితే బాలీవుడ్‌లో మాత్రం 'స్త్రీ 2', 'ఛావా' వంటి కొన్ని మెరుపులు మినహా బ్లాక్‌బస్టర్ విజయాలు కొంతకాలంగా కనిపించడంలేదు.
ఇటీవల జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో కలిసి ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ (Javed Akhtar) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులకు దగ్గరవ్వడం లేదని, దీనికి కారణాలేమిటని జావేద్ అక్తర్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
Details
బాక్సాఫీస్‌పై దక్షిణాది ప్రభావం
హిందీ చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించలేకపోతున్నాయి జావేద్ అక్తర్ పేర్కొన్నారు.
కానీ దక్షిణాది హీరోలు హిందీ మార్కెట్లో సూపర్ హిట్ కొడుతున్నారు.
హిందీ ప్రేక్షకులకు అసలు తెలియని నటుల సినిమాలు రూ.600-700 కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతోంది?'' అని ప్రశ్నించారు.
Details
ఆమిర్ ఖాన్ ఏమన్నారంటే?
జావేద్ ప్రశ్నకు స్పందించిన అమీర్ ఖాన్, దక్షిణాది, ఉత్తరాది సినిమాల మధ్య భేదమే లేదు. అసలు సమస్య బాలీవుడ్ బిజినెస్ మోడల్‌లోనే ఉంది.
ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అండ్ సప్లై అనే ఒక సూత్రం ఉంది. కానీ మనం ప్రేక్షకులను రమ్మని అభ్యర్థిస్తాం. వాళ్లు రాకపోతే ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో సినిమాను ఉచితంగా అందిస్తాం.
ఇదే మన ప్రధాన తప్పిదం. థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మనం స్వయంగా కొత్త అలవాటు నేర్పించాం. థియేటర్ బిజినెస్ మోడల్‌ను మనమే నాశనం చేసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.
Details
సినీ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే?
ఆమిర్ ప్రకటన ప్రకారం, బాలీవుడ్ సినిమాలు తిరిగి బలపడాలంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా కొత్త వ్యాపార మోడల్ అమలు చేయాలి.
ప్రత్యక్ష థియేటర్ అనుభవాన్ని ప్రాధాన్యతగా మార్చి, కథలకు కొత్తదనం తీసుకురావాలి. అప్పుడే బాలీవుడ్ మళ్లీ తన గత వైభవాన్ని పొందగలదు.