
ఎస్పీ బాలసుబ్రమణ్యం బర్త్ డే: ఆయనకు జాతీయ అవార్డులు తెచ్చిన పాటలను గుర్తు చేసుకుందాం
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఆయన గొంతులో మాట కూడా పాటైపోతుంది. పాట పాడితే పరవశించిపోని వారుండరు. 40వేలకు పైగా పాటలు, ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న బాలసుబ్రమణ్యం పుట్టినరోజు ఈరోజు.
ఈ సందర్భంగా ఆయన కెరీర్లో జాతీయ అవార్డులు గెలుచుకున్న పాటల గురించి మాట్లాడుకుందాం.
ఓంకార నాదాను(1980)
తన మొదటి జాతీయ అవార్డును శంకరాభరణం అనే సినిమాలోని ఓంకార నాదాను అనే పాటకు గెలుచుకున్నాడు.
ఈ సినిమాకు కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ పాటకు కెవి మహదేవన్ స్వరాలు సమకూర్చగా, సాహిత్యాన్ని వేటూరి అందించారు.
తేరీ మేరీ బీచ్ మే(1981)
ఏక్ ధూజే కే లియే సినిమాలోని పాటకు 1981లో ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
Details
కె విశ్వనాథ్ సినిమాలోని మరో పాటకు జాతీయ అవార్డు
వేదం అణువణువున నాదం (1983)
కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం సినిమాలోని ఈ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఈ పాటకు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. వేటూరి సాహిత్యాన్ని అందించారు.
ఈ సినిమాలో మొత్తం 5పాటలు పాడారు బాలసుబ్రమణ్యం. కమల్ హాసన్, జయప్రద, శరత్ బాబు నటించిన ఈ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ గా నిలిచిపోయింది.
చెప్పాలని ఉంది (1988)
చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాలోని ఈ పాటకు జాతీయ అవార్డు గెలుచుకున్నారు బాలసుబ్రమణ్యం. రుద్రవీణ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీతం విభాగాల్లోనూ జాతీయ అవార్డులు వచ్చాయి.
చెప్పాలని ఉంది పాటకు సంగీతాన్ని ఇళయరాజా సమకూర్చారు.
Details
తంగ తామరై (1995)
మిన్సారా కనారా అనే తమిళ చిత్రంలోని తంగ తామరై పాటకు అవార్డు అందుకున్నారు బాలసుబ్రమణ్యం. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మెరుపు కలలు అనే పేరుతో తెలుగులో డబ్ అయింది ఈ సినిమా.