LOADING...
Andhra to Telangana: శాన్వీ మేఘన మెరుపులతో స్పెషల్ అట్రాక్షన్‌.. నవీన్ పోలిశెట్టి కొత్త సాంగ్ హంగామా 

Andhra to Telangana: శాన్వీ మేఘన మెరుపులతో స్పెషల్ అట్రాక్షన్‌.. నవీన్ పోలిశెట్టి కొత్త సాంగ్ హంగామా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నుంచి 'ఆంధ్ర టూ తెలంగాణ' అనే మాస్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో శాన్వీ మేఘన తన గ్లామర్‌, అదిరిపోయే స్టెప్పులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు నవీన్ పోలిశెట్టి తనదైన ఎనర్జీతో, మార్క్ స్టైల్‌లో ప్రేక్షకులను అలరించాడు. ఈ పాటకు మిక్కి జే మేయర్ సంగీతం అందించగా, సాహిత్యాన్ని చంద్రబోస్ సమకూర్చారు. ఇక ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.

Advertisement