Page Loader
Game Changer: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం 16 వందల మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు
గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం 16 వందల మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు

Game Changer: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం 16 వందల మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌లో పుష్ప 2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు గేమ్‌ ఛేంజర్ సినిమా కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలో గేమ్‌ ఛేంజర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గేమ్‌ ఛేంజర్ హీరో, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఆయన బాబాయి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతుండటంతో జిల్లా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్ కోసం ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేయగా, దాదాపు లక్ష మంది అభిమానులు హాజరవుతారని అంచనా వేశారు.

Details

ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు

ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందుగా 400 మంది పోలీస్‌ అధికారులు, 1200 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం నియమించారు. పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిన తరువాత ఆయన హాజరవుతున్న తొలి సినిమా ఈవెంట్‌ గేమ్‌ ఛేంజర్ కావడం, అలాగే చిరంజీవి కుమారుడు రామ్‌ చరణ్‌ ఇందులో హీరోగా నటించడం మెగా అభిమానులను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అంశాలుగా నిలిచాయి. గ్రౌండ్‌ సమీపంలో 20,000 వాహనాలకు సరిపడే ఐదు పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద బారికేడ్లు, హైమాక్స్‌ లైట్లు ఏర్పాటుచేయడంతో పాటు భద్రతను మరింత మెరుగుపరిచారు.