LOADING...
Spider-Man: స్పైడర్ మ్యాన్ షాకింగ్ రికార్డ్..ట్రైలర్‌కే 100 కోట్లు వ్యూస్!
స్పైడర్ మ్యాన్ షాకింగ్ రికార్డ్..ట్రైలర్‌కే 100 కోట్లు వ్యూస్!

Spider-Man: స్పైడర్ మ్యాన్ షాకింగ్ రికార్డ్..ట్రైలర్‌కే 100 కోట్లు వ్యూస్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 27, 2026
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపితమైంది. తాజాగా విడుదలైన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కొన్ని రోజులలోనే ఈ ట్రైలర్ 1 బిలియన్ వ్యూస్ (100 కోట్ల వ్యూస్) మైలురాయిని దాటింది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో టామ్ హాలండ్ మళ్లీ స్పైడర్ మ్యాన్ పాత్రలో అభిమానులను అలరిస్తున్నారు. అతనికి జోడీగా జెండయా నటిస్తున్నారు. జాకబ్ బాటలన్, సాడీ సింక్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో వంటి ప్రఖ్యాత తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా మార్క్ రుఫలో (హల్క్) ప్రస్తావన ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

వివరాలు 

గ్రాండ్‌గా రిలీజ్ కానున్న మూవీ..

సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శనకు రానుంది. భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచి, ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. IMAX, 3D, 4DX వంటి అన్ని ప్రీమియం ఫార్మాట్లలో స్పైడర్ మ్యాన్ సందడి చేస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత చిత్రాల రికార్డులను మళ్లీ రాయగలదా అనే ఆసక్తితో, 'బ్రాండ్ న్యూ డే' వసూళ్ల పరంగా ఎంత ఘన విజయం సాధిస్తుందోనని సినీ విశ్లేషకులు ఉత్సుకతతో గమనిస్తున్నారు.

Advertisement