
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్' రిలీజ్ డేట్, షూటింగ్ టైం ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న సందీప్ రెడ్డితో ప్రభాస్ కలిసి పనిచేయనున్నాడు.
ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
'స్పిరిట్' (Spirit)పేరుతో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
స్పిరిట్ చిత్రాన్ని 2025 కిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రకటించాడు.
Details
2024లో 'స్పిరిట్' షూటింగ్
సెప్టెంబర్ 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని, ఈ గ్యాప్ లోనే స్క్రిప్ట్ ను పూర్తి చేస్తానని సందీప్ రెడ్డి వెల్లడించారు.
ఈ సినిమాతో ప్రభాస్ ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని చెప్పాడు.
ఇక 'యానిమల్' రిలీజ్ అయిన వెంటనే స్పిరిట్ పనిని ప్రారంభిస్తామని, సెప్టెంబర్ 2024లో షూటింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నాడు.
భయం అన్నదే తెలియని ఒక కరడుగట్టిన పోలీస్ అధికారి కథతో 'స్పిరిట్' రూపొందనున్నట్టు సమాచారం.