స్పై సినిమాకు పెరిగిన టిక్కెట్ ధరలు: ఏ ప్రాంతంలో ఎంత పెరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో విజయం దక్కించుకున్న యంగ్ హీరో నిఖిల్, స్పై పేరుతో పాన్ ఇండియా సినిమాను తీసుకొస్తున్నాడు.
సినిమా థియేటర్లలో జూన్ 29న రిలీజ్ అవుతున్న ఈ చిత్ర టిక్కెట్ ధరలు పెరిగినట్లు సమాచారం. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ ధరలు విపరీతంగా పెరిగాయి.
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో స్పై సినిమా టిక్కెట్ ధర రూ.175 గా ఉండనుంది. మల్టీప్లెక్స్ లలో రూ.295గా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్లలో రూ.145గా ఉంటే మల్టీప్లెక్సుల్లో రూ.177గా ఉండనుంది. భారీగా పెరిగిన టిక్కెట్ ధరల కారణంగా స్పై సినిమాకు భారీగా వసూళ్ళు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Details
సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేధించే కథ
స్పై సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేధించే స్పై ఏజెంట్ గా నిఖిల్ కనిపించనున్నాడట.
రిలీజైన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి.
ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్, అభినవ్ గొమఠం, సాన్యా ఠాకూర్, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాను గ్యారీ బీ హెచ్ డైరెక్ట్ చేసారు.
ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు, కె రాజశేఖర్ రెడ్డి కథను అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు.
శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంయుక్తంగా సంగీతం అందించారు.