Squid Game: 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణను అందుకున్న నెట్ ఫ్లిక్స్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటివరకు రెండు సీజన్‌లు విడుదలై విశేష ప్రజాదరణ పొందిన ఈ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో సిద్ధమవుతోంది.
ఇటీవల విడుదలైన 'స్క్విడ్ గేమ్ 3' టీజర్ ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది.
జూన్ 27వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సీజన్ స్ట్రీమింగ్‌కి రానుందని సిరీస్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తతో అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
2021లో మొదటి సీజన్ విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత వరుసగా రికార్డులు తిరగరాసింది.
అంతేకాకుండా, అంతర్జాతీయంగా పలు అవార్డులను గెలుచుకుంది.
వివరాలు
సీజన్ 2లో ఏం జరిగిందంటే..?
2023 చివరిలో రెండో సీజన్ విడుదలై అదే స్థాయిలో ప్రేక్షకాభినందనలు పొందింది.
ఇప్పుడు మూడో సీజన్ ద్వారా మళ్లీ అభిమానులను ఊహల లోకానికి తీసుకెళ్లేందుకు ఈ సిరీస్ సిద్ధంగా ఉంది.
రెండో సీజన్‌లో కథను కొనసాగించిన షియెంగ్ జీ హున్ (Lee Jung-jae) 'స్క్విడ్ గేమ్'లో అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసి 45.6 బిలియన్ కొరియన్ వోన్ నగదు గెలుచుకుంటాడు.
అయితే ఈ గెలుపు అతని మనస్తత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఈ ఆటను నిర్వహిస్తున్న మిస్టీరియస్ ఫ్రంట్‌మ్యాన్ అనే వ్యక్తిని ట్రాక్ చేసి, ఈ మానవత్వహీన ఆటను ఆపేయాలని సంకల్పిస్తాడు.
గేమ్‌ను నిర్వహించే వారిని గుర్తించేందుకు అతను తన సంపూర్ణ డబ్బును ఖర్చు చేస్తూ విచారణను కొనసాగిస్తాడు.
వివరాలు
సీజన్ 2లో ఏం జరిగిందంటే..?
ఇక మరోవైపు, తన అన్నయ్య కోసం 'స్క్విడ్ గేమ్'లోకి చొరబడి గాయపడిన హ్వాంగ్ జున్ హో (Wi Ha-joon) కోలుకొని మళ్లీ పోలీస్ డిటెక్టివ్‌గా తన బాధ్యతలు చేపడతాడు.
ఒక రోజు అనుకోకుండా షియెంగ్ జీ హున్‌ను కలుస్తాడు. ఇద్దరూ కలసి గేమ్ వెనుక ఉన్న వాస్తవాలను బయటపడేసేందుకు ప్రయత్నిస్తారు.
ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, ప్రమాదాలను ఎదుర్కొంటారు. చివరికి షియెంగ్ జీ హున్ ఫ్రంట్‌మ్యాన్‌ను పట్టుకుంటాడు. ఇదే రెండో సీజన్‌కు ముగింపు అవుతుంది.
వివరాలు
సీజన్ 3లో ఏం చూపించబోతున్నారంటే..?
తాజాగా విడుదలైన టీజర్ ప్రకారం, షియెంగ్ జీ హున్ ఈ హింసాత్మక ఆటకు శాశ్వతంగా ముగింపు పలకాలని పూనుకుంటాడు.
ఫ్రంట్‌మ్యాన్‌ను పూర్తిగా అంతమొందించగలిగాడా లేదా అనేది ప్రధాన హైలైట్‌గా ఉండనుంది.
నెట్‌ఫ్లిక్స్ ఈ టీజర్‌ను షేర్ చేస్తూ.. "చివరి ఆటలు ఆడాల్సిన సమయం వచ్చింది" అని పేర్కొంది.
ఇది చూస్తే, ఈ సీజన్‌దే చివరి ఎపిసోడ్‌లు కావొచ్చని భావిస్తున్నారు.