Single Trailer : ఫుల్ ఫన్‌తో శ్రీవిష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం 'సింగిల్'. కార్తీక్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
కథానాయికలుగా కేతికా శర్మ, ఇవానా నటిస్తున్నారు. మే 9న థియేటర్లలోకి రానున్న ఈ మూవీకి సంబంధించి ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
ట్రైలర్ మొత్తం ఫన్‌తో నిండిపోయింది. ట్రైలర్ చూస్తుంటే, శ్రీ విష్ణు తనకు బాగా సెట్ అయిన ఫన్ జానర్‌లో మళ్లీ అడుగుపెట్టినట్లు స్పష్టమవుతోంది.
గతేడాది ఆయన చేసిన 'స్వాగ్' చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ కామెడీ ట్రాక్‌ను ఎంచుకున్నారు. ఈ సినిమాలో ఒక సింగిల్ అబ్బాయి అమ్మాయిలతో ప్రేమలో పడిన తర్వాత ఎదుర్కొనే ఫన్నీ పరిణామాలను చూపించారు.
Details
మే 9న రిలీజ్
ట్రైలర్ మొత్తం కామెడీ ప్రధానంగా సాగుతోంది. ఇందులో 'ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు గానీ, రిచ్ అని కాదు' అనే వెన్నెల కిషోర్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ద్వారా వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు హాస్య ట్రాక్ ఆకర్షణగా నిలుస్తుందని అర్థమవుతోంది. ఇటీవలే పాపులర్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ కూడా ఇందులో కనిపించనున్నాడు.
ట్రైలర్‌లో పూర్తిగా కథను రివీల్ చేయకపోయినా, సినిమా బేస్‌ను మాత్రం క్లియర్‌గా చూపించారు. మే 9న విడుదలవుతున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.