LOADING...
Sreela Majumdar: క్యాన్సర్‌తో సీనియర్ హీరోయిన్ కన్నుమూత 
Sreela Majumdar: క్యాన్సర్‌తో సీనియర్ హీరోయిన్ కన్నుమూత

Sreela Majumdar: క్యాన్సర్‌తో సీనియర్ హీరోయిన్ కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Jan 28, 2024
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ పరిశ్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత బెంగాలీ నటి శ్రీలా మజుందార్ (65)క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీలా మజుందార్ భర్త ఎస్ఎన్ఎం అబ్ది జర్నలిస్ట్, కాలమిస్ట్‌గా చాలా పాపులర్. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. మజుందార్ గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఈ నెల ప్రారంభంలో ఆసుపత్రిలో చేరినట్లు అబ్ది తెలిపారు. ఆమెను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకురాగా.. శనివారం ఆమె తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. దర్శక దిగ్గజం మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో మజుందార్ నటించారు. మజుందార్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మజుందార్ సంతాపం తెలిపారు. ఆమె మరణ వార్త బాధ కలిగించినట్లు ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మమతా బెనర్జీ ట్వీట్