
కోటబొమ్మాళి పీఎస్ మొదటి పాట: శ్రీకాకుళం యాసలో ఆసక్తి రేపుతున్న పాట
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళంలో మంచి విజయం అందుకున్న నాయట్టు సినిమాను తెలుగులో శ్రీకాంత్ హీరోగా కోటబొమ్మాళి పీఎస్ టైటిల్ తో దర్శకుడు తేజ మర్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేసారు. లింగి లింగి లింగిడి అంటూ శ్రీకాకుళం యాసలో సాగే ఈ పాటను హీరోయిన్ శ్రీలీల చేత విడుదల చేయించారు.
పాట మొత్తం శ్రీకాకుళం యాసలో ఉంది. రేలారే రేలా ఫేమ్ పి రఘు సాహిత్యం అందించి తానే పాడారు. మిధున్ ముకుందన్ సంగీతం అందించారు.
ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా కనిపిస్తుంటే, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.
Details
గీతా ఆర్ట్స్ 2 నిర్మాణంలో కోటబొమ్మాళి పీఎస్
మలయాళం నాయట్టు సినిమా హక్కులను అల్లు అరవింద్ చాలా రోజుల క్రితమే కొనుక్కున్నారు. ముందుగా ఈ సినిమాను తెలుగు అనువాదం చేసి ఆహాలో విడుదల చేయాలని అనుకున్నారు.
అనేక కారణాల వల్ల ఈ సినిమాను రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యారు. హత్య కేసులో ఇరుక్కున్న పోలీసు అధికారులు, దాన్నుండి బయటపడటానికి ఏం చేసారనేది నాయట్టు సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
ప్రస్తుతం కోటబొమ్మాళి పీఎస్ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోటబొమ్మాళి పీఎస్ మొదటి పాట
Happy to launch the #LingiLingiLingidi song from #KotaBommaliPS ❤️🔥#SrikakulamMassFolklore 💥 https://t.co/d9mXGEBzio@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @GA2Official @DirTejaMarni @Rshivani_1 @ActorRahulVijay @m3dhun @adityamusic pic.twitter.com/pPjmFwxrAS
— sreeleela (@sreeleela14) September 11, 2023