SHRIMAD BHAGAVATAM: వెండితెరపై 'శ్రీమద్భాగవతం'.. ఏడు భాగాలుగా భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం!
ఈ వార్తాకథనం ఏంటి
పవిత్ర హిందూ గ్రంథమైన 'భాగవత మహాపురాణం' (Bhagavata Mahapurana) త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. గురుపౌర్ణమి సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. 'శ్రీమద్భాగవతం' పేరుతో భారీ స్థాయిలో లైవ్ యాక్షన్ ఫిల్మ్ సిరీస్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న 'ఏడు రోజుల భాగవత పారాయణ సంప్రదాయాన్ని' స్ఫూర్తిగా తీసుకుని ఈ పురాణ గాథను 'ఏడు భాగాలుగా' తెరకెక్కించనున్నారు.
వివరాలు
త్వరలోనే మరిన్ని విషయాలు
ఈ ప్రాజెక్టుకు 'సప్త' అనే పేరును ఖరారు చేశారు. ఈ ఫ్రాంచైజీలోని ఏడు చిత్రాలు ఒకదానికొకటి అనుసంధానమై పూర్తి కథను ప్రేక్షకులకు అందించనున్నాయి.
ఈ భారీ చిత్ర ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.
'శ్రీమద్భాగవతం' ఆధారంగా రూపొందనున్న ఈ లైవ్ యాక్షన్ సిరీస్‌పై సినీ, ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.