Page Loader
#SSMB 28: టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేసిన టీమ్ 
రేపు సాయంత్రం 6:03గంటలకు టైటిల్ రివీల్

#SSMB 28: టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేసిన టీమ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 30, 2023
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు 28వ సినిమా టైటిల్ రివీల్ కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచుస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31వ తేదీన టైటిల్ ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. తాజాగా టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేసింది. రేపు సాయంత్రం 6:03గంటలకు టైటిల్ ని రివీల్ చేస్తామని ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం మళ్ళీ విడుదలయ్యే థియేటర్లలో మహేష్ బాబు 28వ సినిమా టైటిల్ రివీల్ అవుతుందని తెలియజేసారు. ఈ మేరకు థియేటర్ల లిస్టు కూడా చెప్పేసారు. అయితే ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని చెప్పుకుంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహేష్ బాబు 28వ సినిమా టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్