LOADING...
SSMB 28 టైటిల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్; అభిమానులు రెడీగా ఉండండి 
మే 31వ తేదీన రిలీజ్ కానున్న టైటిల్

SSMB 28 టైటిల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్; అభిమానులు రెడీగా ఉండండి 

వ్రాసిన వారు Sriram Pranateja
May 26, 2023
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ని రివీల్ చేసే సమయం వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31వ తేదీన, మహేష్ బాబు 28వ సినిమా టైటిల్ ని రివీల్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ చిత్ర టైటిల్ ని పెద్ద ఎత్తున రివీల్ చేస్తున్నారు. ఎవ్వరూ చేయని విధంగా సరికొత్తగా టైటిల్ రివీల్ ని థియేటర్లలో చేయనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, 2024 జనవరి 13న రిలీజ్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

SSMB 28 టైటిల్ రివీల్ పై ట్వీట్